Telegram Channel
Join Now
NIPER అహ్మదాబాద్ నాన్-ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి సమాచారం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER), అహ్మదాబాద్ నుండి నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. సర్కార్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ ఆర్టికల్‌లో ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు వివరాలు గురించి వివరంగా అందించాం.
ఖాళీల వివరాలు
NIPER అహ్మదాబాద్‌లో 16 నాన్-ఫ్యాకల్టీ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
Sl. No | పోస్టు పేరు | పే లెవల్ (7th CPC) | ఖాళీలు | గరిష్ట వయస్సు |
---|---|---|---|---|
1 | ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ | లెవల్ 12 | 1 | 45 ఏళ్లు |
2 | లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ | లెవల్ 10 | 1 | 40 ఏళ్లు |
3 | ఎస్టేట్ & సెక్యూరిటీ ఆఫీసర్ | లెవల్ 10 | 1 | 45 ఏళ్లు |
4 | మెడికల్ ఆఫీసర్ | లెవల్ 10 | 1 | 40 ఏళ్లు |
5 | గెస్ట్ హౌస్ & హాస్టల్ సూపర్వైజర్ | లెవల్ 9 | 1 | 35 ఏళ్లు |
6 | సైంటిస్ట్ / టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ I | లెవల్ 9 | 1 | 40 ఏళ్లు |
7 | సైంటిస్ట్ / టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ II | లెవల్ 8 | 1 | 35 ఏళ్లు |
8 | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | లెవల్ 8 | 1 | 35 ఏళ్లు |
9 | సెక్రటరీ టు రిజిస్ట్రార్ | లెవల్ 8 | 1 | 40 ఏళ్లు |
10 | పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ | లెవల్ 8 | 1 | 35 ఏళ్లు |
11 | టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ విభాగం) | లెవల్ 7 | 1 | 35 ఏళ్లు |
12 | అకౌంటెంట్ | లెవల్ 7 | 1 | 35 ఏళ్లు |
13 | రిసెప్షనిస్ట్ & టెలిఫోన్ ఆపరేటర్ | లెవల్ 7 | 1 | 35 ఏళ్లు |
14 | అసిస్టెంట్ గ్రేడ్ I | లెవల్ 6 | 1 | 35 ఏళ్లు |
15 | అసిస్టెంట్ గ్రేడ్ II | లెవల్ 5 | 2 | 35 ఏళ్లు |
16 | జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ | లెవల్ 4 | 2 | 27 ఏళ్లు |
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి Telegram Channel |
దరఖాస్తు ఫీజు వివరాలు
కేటగిరీ | దరఖాస్తు ఫీజు |
---|---|
లెవల్ 10 & అంతకంటే ఎక్కువ | ₹1,000 |
లెవల్ 9 & అంతకంటే తక్కువ | ₹500 |
SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు | ఫీజు మినహాయింపు |
ఫీజు చెల్లింపు విధానం:
- దరఖాస్తు ఫీజు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ లో చెల్లించాలి.
- ఫీజు రీఫండ్ చేయబడదు, కనుక అభ్యర్థులు అప్లై చేసేముందు అన్ని వివరాలు సరిగ్గా తనిఖీ చేసుకోవాలి.
- ఫీజు చెల్లించిన తర్వాత ఇ-రసీదు డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి.
కోయంబత్తూర్ జీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్‌లో క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీ – 2025 : Apply
ఎంపిక విధానం
- ప్రాథమిక స్క్రీనింగ్: దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన.
- రాత పరీక్ష/స్కిల్ టెస్ట్: పోస్ట్ ఆధారంగా రాత పరీక్ష లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది.
- ఇంటర్వ్యూకు పిలుపు: రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
- దస్త్రాల పరిశీలన: తుది ఎంపికకు ముందు ఒరిజినల్ డాక్యుమెంట్లను వెరిఫై చేస్తారు.
- ఫైనల్ సెలెక్షన్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్ NIPER Ahmedabad సందర్శించండి.
- “Apply Online” పేజీలోకి వెళ్లి ఫారం నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు చెల్లించండి.
- ప్రింట్ తీసుకుని, హార్డ్ కాపీ క్రింది అడ్రస్‌కు పంపండి: The Registrar, NIPER Ahmedabad, Opp. Air Force Station, Palaj, Gandhinagar-382355, Gujarat, India.
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి Telegram Channel |
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22/02/2025
- దరఖాస్తు చివరి తేది: 23/03/2025
- హార్డ్ కాపీ సమర్పణ చివరి తేది: 30/03/2025
అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి