Madhu Jobs Uncategorized Mee seva kendra details telugu

Mee seva kendra details telugu

ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకుచెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలనుఊరూరాఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంಣనిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోనిస్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరుచేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలనుఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగాఆదేశించింది. పంద్రాగస్టు నాటికి వీటిని ప్రారంభించాలనిప్రభుత్వం యోచిస్తోంది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,525గ్రీమీ సేవ కేంద్రాలున్నాయి. వీటిలో మూడు వేల వరకునగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలుండగా..వేయిన్నర వరకేగ్రామాల్లోఉన్నాయి.ధ్రవీకరణపత్రాలతోపాటు ఆధార్ సేవలు,

దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ, 600కుపైగా ప్రైవేటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలుపట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళాశక్తి పథకం కిందుకేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

గ్రామైక్య సంఘాల పేరిట..

 

గ్రామైక్య సంఘాల(విలేజ్ ఆర్గనైజేషన్) పేరిట మహిళా శక్తిగ్రమీసేవ కేంద్రాలను(ఎమ్మెస్ ఎమ్మెస్సీ) రాష్ట్ర ప్రభుత్వంమంజూరు చేస్తుంది.

 

ఏర్పాటుకు రూ.2.50 లక్షల రుణాన్ని స్త్రీనిధి ద్వారాకపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది.వీటితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పేరొందినకంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎన్,బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్కొనుగోలు చేయాలి. కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయాసంఘాలు రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించాలి.

 

స్త్రీనిధి, స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వపాఠశాల, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదాఇతర ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో మీసేవకేంద్రానికి 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతోవసతి కల్పిస్తారు.

ఆయా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన సభ్యురాళ్లను మీసేవ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు. కేంద్రం నిర్వహణ,సేవలపై మీ సేవ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. అనంతరంఆయా మహిళా సంఘాలతో మీసేవ సంస్థ అవగాహనఒప్పందం చేసుకుంటుంది.

ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుముల మేరకుపారదర్శకమైన సేవలందిస్తారు. మీసేవ అధికారులుఎప్పటికప్పుడు ఆయా కేంద్రాలను పరిశీలించి వాటినిర్వహణకు పర్యవేక్షిస్తారు.నెలరోజులు శిక్షణ..

ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికినెలరోజులపాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించినఅనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలనిప్రభుత్వం భావిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post